ప్రతి మహిళకు ఉపాధి కల్పించి ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం--మంత్రి సీతక్క
మహిళలు ఆర్థికంగా సంపన్నులైతే ,రాష్ట్రం సుసంపన్నంగా ఉంటుందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు.శనివారం రోజున ఆలేరు మండల కేంద్రంలో నూతన దుర్గా భాయ్ మహిళా శిశు వికాస కేంద్రం ప్రారంభోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ,గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దనసరి సీతక్క, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, ప్రభుత్వ విప్ నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు, రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్ పర్సన్ బండ్రు శోభారాణి,జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్స్ కి గతంలో లేని విధంగా 61 సంవత్సరం వచ్చిన వారిని రిటైర్డ్ చేయడం జరిగింది. అంగన్వాడి టీచర్ల సమస్యలను తెలుసుకొని వాళ్ల సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని అన్నారు.ముఖ్యమంత్రి ఆలోచన మేరకు ఆడపడుచులకు పెట్రోల్ బంకులు, గోడౌన్, సోలార్ ప్లాంట్ లు మహిళలకే ఇవ్వాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన అని అన్నారు గతంలో 60 సంవత్సరాలు దాటిన మహిళలకు సమ భావన సంఘంలో చోటు ఉండేది కాదని, ఇప్పుడు 60 సంవత్సరాలు దాటినా వారికి మహిళ సంఘము ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి ఆడబిడ్డల గురించి అలోచించి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు.మహిళా సంఘములో ఉండి మహిళ లోన్ తీసుకొని చనిపోతే రెండు లక్షల లోన్ భీమా సౌకర్యం కల్పించడం జరిగిందని అన్నారు. మహిళల కోసం 5 లక్షలు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది,రాష్టంలో 61 వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు.మహిళ సంఘాలకు ఆలేరు నియోజకవర్గానికి 1250 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇవ్వడం జరిగిందని మంత్రి తెలిపారు మహిళలు బస్సు కి ఓనర్ చేయాలనే ఉద్దేశంతో, డ్రైవింగ్ శిక్షణలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో 67 లక్షల మంది మహిళా సంఘాలలో ఉన్నారని, అందులో 12 లక్షల మందికి చదువు రానివారు ఉన్నారని, ఆరు లక్షల మందికి అమ్మకి అక్షరమాల క్రింద చదువు చెప్పించి, పదవ తరగతి లో ఉత్తీర్ణత సాధించరాని తెలిపారు.
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... ఆలేరు పట్టణంలో దుర్గా భాయ్ మహిళా శిశు వికాస కేంద్రం ఏర్పాటు చేసుకోవడం ఇది మహిళలందరికీ కూడా స్వయం ఉపాధికి ఒక మంచి ఆలోచన చేసినటువంటి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కి కృతఙ్ఞతలు తెలిపారు. మహిళల కోసం ఇంత మంచి సెంటర్ ఏర్పాటు చేయడం మహిళలందరినీ ఒక శక్తివంతమైన చేయాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని తదనుగుణంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులను అనే ఒక నినాదంతో ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తూ ప్రతి సంక్షేమ పథకం మహిళల పేరున ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా ప్రతి మహిళకు ఉపాధి కల్పించి ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు.
ప్రభుత్వ విప్ ,ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య మాట్లాడుతూ...ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం తీసుకొచ్చిన మహిళల పేరునే ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఇంట్లో మహిళా ఆర్థికంగా బలోపేతం అయ్యి ఉంటే ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఆర్థికంగా బలోపేతం అవుతారన్నారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం పెద్ద పీట వేసి మహిళలు కట్టిన రుణాలు వడ్డీ రుణాలగా తిరిగి మహిళా సంఘాలకు ప్రభుత్వం అందిస్తుందన్నారు. గత ప్రభుత్వం మహిళలను ఏ విషయాలలోనూ పట్టించుకోలేదని అదే ప్రజాపాలన ప్రజా ప్రభుత్వం వచ్చిన తరవాత మహిళా ఆత్మ గౌరవాన్ని పెంచుతూ ప్రతి సంక్షేమ కార్యక్రమం మహిళలతోనే మొదలు పెట్టడం జరుగుతుందన్నారు. మహిళలు బలోపేతం అవ్వడానికి ఆర్టీసీ బస్సు ఓనర్లుగా ప్రభుత్వం మహిళలకు బస్సులు ఇవ్వడం జరిగిందన్నారు. ఆలేరు పట్టణాన్ని అన్ని విధులుగా అభివృద్ధి చేస్తానని ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు హామీ ఇచ్చారు.
రాష్ట్ర మహిళా కార్పొరేషన్ ఛైర్పర్సన్ బండు శోభారాణి మాట్లాడుతూ.... ఆలేరు పట్టణంలో ఇంత మంచి దుర్గ భాయ్ మహిళ శిశు వికాస భవనం మహిళల కొరకు కట్టించినందుకు ముందుగా పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి కి కృతఙ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల పై ప్రత్యేక దృష్టి పెట్టి మహిళలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, మహిళలకు ఈ కేంద్రంలో వివిధ రకాల శిక్షణ తరగతులు నిర్వహించి ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ఉపయోగించి మరెన్నో సదుపాయాల కల్పన చేయాలన్నారు.194 స్వయం సహాయక సంఘాల సభ్యులకు 4,21,00,000 శ్రీనిధి బ్యాంకు లింకేజీ చెక్ ను అందజేశారు.621 స్వయం సహాయక సంఘాలకు 58,58,25,000/- బ్యాంకు లింకేజీ చెక్ ను మహిళలాసంఘాల సభ్యులకు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లు,జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, శిశు సంక్షేమ అధికారి నరసింహారావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.