BREAKING
thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్
Date of Publish : 20 June 2026, 08:24 pm
Posted by : V శ్రీనివాస్

​సింగరేణిలో రూ. 1600 కోట్ల బొగ్గు స్కాంపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? - బీఆర్ఎస్ నేత నడిపెల్లి విజిత్ కుమార్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
20 Jun, 2026 - 08:24 PM
107 వీక్షణలు

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన రూ. 1,600 కోట్ల భారీ బొగ్గు కుంభకోణంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, ఇంత పెద్ద కుంభకోణం జరిగినా కేంద్ర ప్రభుత్వం వహిస్తున్న మౌనం పలు అనుమానాలకు తావిస్తోందని తీవ్రంగా ఆరోపించారు.

​సింగరేణి సంస్థలో కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉందని, ఈ నేపథ్యంలో సంస్థలో జరిగిన భారీ అవకతవకలపై కేంద్రం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఈ కుంభకోణంపై భాగస్వామిగా ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి విచారణ జరపకపోవడం, బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హమని ఆయన నిలదీశారు.

​ఈ బొగ్గు స్కాంపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి, ఇందులో పాలుపంచుకున్న బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజిత్ కుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో కేంద్రం పూర్తిగా విఫలమవుతోందని, ఈ భారీ కుంభకోణం విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం తన నిర్లక్ష్య వైఖరిని కొనసాగించడం దురదృష్టకరమని ఆయన మండిపడ్డారు