BREAKING
thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్
Date of Publish : 20 June 2026, 07:13 pm
Posted by : V శ్రీనివాస్

​ఘనంగా కామ్రేడ్ వై.తారక్‌నాథ్ వర్ధంతి ఎస్బీఐ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
20 Jun, 2026 - 07:13 PM
153 వీక్షణలు

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రెడ్డి కాలనీ బ్రాంచ్ ఆధ్వర్యంలో శనివారం 'యూనియన్ డే' (ఎస్బీఐ ఎస్.యు.హెచ్.సి)ను పురస్కరించుకుని భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఎస్బీఐ మాజీ ఉద్యోగి, దివంగత కామ్రేడ్ వై.తారక్‌నాథ్ 22వ వర్ధంతిని స్మరించుకుంటూ ఈ సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

​కామ్రేడ్ కె.శ్రీనివాస్ పర్యవేక్షణలో జరిగిన ఈ శిబిరంలో ఎస్బీఐ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.

​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్బీఐ రీజనల్ మేనేజర్ రితేష్ కుమార్ గుప్తా, చీఫ్ మేనేజర్ అలోక్ వర్మ, హెచ్.ఆర్. రామకృష్ణ హాజరయ్యారు. వీరితో పాటు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ మంచిర్యాల జిల్లా జనరల్ సెక్రెటరీ చందూరి మహేందర్, స్టేట్ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు వి.మధుసూదన్ రెడ్డి విచ్చేసి రక్తదాతలను అభినందించారు.

​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆపదలో ఉన్నవారికి రక్తదానం ప్రాణదానంతో సమానమని పేర్కొన్నారు. సామాజిక బాధ్యతను గుర్తించి ఎస్బీఐ సిబ్బంది ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ముందుండడం ఎంతో అభినందనీయమని కొనియాడారు.

​ఈ కార్యక్రమంలో ఎస్బీఐ బ్యాంకు సిబ్బంది, ఇండియన్ రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్ వైద్య బృందం, స్థానిక యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు