BREAKING
thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● పల్లె పండుగ–3.O తో పల్లెల్లో రహదారుల అభివృద్ధి thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● దసరా సందర్భంగా బోనస్ ఇవ్వాలని కోరుతూ లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా thumb ● పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్ష thumb ● ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● పల్లె పండుగ–3.O తో పల్లెల్లో రహదారుల అభివృద్ధి thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● దసరా సందర్భంగా బోనస్ ఇవ్వాలని కోరుతూ లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా thumb ● పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్ష thumb ● ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక
Date of Publish : 20 June 2026, 06:38 pm
Posted by : కూనురు మధు

చిట్యాల సమీపంలో లారీ క్లీనర్ మృతి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
20 Jun, 2026 - 06:38 PM
710 వీక్షణలు

నల్గొండ జిల్లా చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని నేషనల్ హైవే 65 పక్కన ఉన్న '7 హోటల్' సమీపంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. చిట్యాల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోకు చెందిన లారీ క్లీనర్ లకేంద్ర (33)గా గుర్తించారు. వారం రోజుల క్రితం పని కోసం బయలుదేరిన లకేంద్ర గత రెండు రోజులుగా కుటుంబ సభ్యులకు అందుబాటులోకి రాలేదు. దీంతో అతని కోసం వెతుకుతూ బుధవారం (26-06-2024) చిట్యాలకు వచ్చిన బంధువులకు, హోటల్ సమీపంలో లకేంద్ర మృతదేహం కనిపించింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అతను, సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం మరియు ఎండ తీవ్రతకు వడదెబ్బ తగలడం వల్లే మరణించి ఉంటాడని బంధువులు తెలిపారు. మృతిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని పేర్కొన్నారు. మృతుడి మేనబావ దిలీప్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిట్యాల ఎస్ఐ ఎం. రవికుమార్ తెలిపారు.