BREAKING
thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ
Date of Publish : 20 June 2026, 07:12 pm
Posted by : V శ్రీనివాస్

​కాంగ్రెస్ పాలనలో రైతాంగానికి దగా: మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ధ్వజం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
20 Jun, 2026 - 07:12 PM
171 వీక్షణలు

  • ​రైతు సంక్షేమాన్ని గాలికొదిలేసిన సీఎం రేవంత్ రెడ్డి
  • ​పంట కొనుగోళ్లలో పూర్తిగా చేతులెత్తేసిన ప్రభుత్వం
  • ​కేసీఆర్ హయాంలోనే రైతులకు సుభిక్షం: నడిపెల్లి దివాకర్ రావు

​మంచిర్యాల:

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిలువునా దగా చేస్తుందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

​ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుల సంక్షేమం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని దివాకర్ రావు మండిపడ్డారు. వ్యవసాయ రంగాన్ని, రైతుల కష్టాలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగా అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

​పంట కొనుగోళ్లలో ప్రభుత్వ వైఫల్యం

ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన పంట కొనుగోళ్ల విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. రైతుల ఉత్పత్తులను సకాలంలో కొనుగోలు చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని, కొనుగోలు బాధ్యతలను గాలికొదిలేసి రైతులను నడి రోడ్డున నిలబెట్టిందని ఆరోపించారు. ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్లే రైతులు ఈ దుస్థితిని ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

​కేసీఆర్ పాలనలోనే సుభిక్షం

గత ప్రభుత్వ పాలనను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హయాంలో రైతులు ఎంతో సుభిక్షంగా, సంతోషంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. ఆనాడు వ్యవసాయానికి పెద్దపీట వేసి రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నారని, కానీ నేడు కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయని దివాకర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాలని, పంట కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు