ఎర్నగూడెంలో అంగన్‌వాడీ సిబ్బందికి సన్మానం
దేవరపల్లి: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా దేవరపల్లి మండలం ఎర్నగూడెం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాలను బీజేపీ నాయకులు సందర్శించారు.
ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్లతో సమావేశమై గత 25 ఏళ్లుగా వారు అందిస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వారిని శాలువాలతో సత్కరించారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అందుతున్న సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు
ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల గురించి అంగన్‌వాడీ సిబ్బందికి వివరించినట్లు నిర్వాహకులు తెలిపారు.
బీజేపీ మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు పుట్టా వెంకటలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ దేవరపల్లి మండల అధ్యక్షుడు కోలా రామకృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యుడు మండా జనార్దన్ రావు, మండల ఉపాధ్యక్షులు పుట్టా హరిప్రసాద్, బండి రామకృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ శ్రీనివాస్, వీవర్స్ సెల్ కన్వీనర్ అల్లంక సత్యనారాయణ, మండల యువ మోర్చా అధ్యక్షుడు పుట్టా రాజేష్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.