మధిర శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నగోవిందం
తెలంగాణ
/
ఖమ్మం
మధిర పట్టణంలోని వర్తక సంగంలో వేంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి మంగళవారం నిర్వహించే అన్నగోవిందం కార్యక్రమం భక్తిశ్రద్ధలతో కొనసాగింది.
ఈ సందర్భంగా కీ॥శే॥ శ్రీమాన్ సముద్రాల మహాలక్ష్మమ్మ జ్ఞాపకార్థం వారి కుమారులు, కీ॥శే॥ శ్రీమాన్ నారిశెట్టి రంగారావు జ్ఞాపకార్థం ధర్మపత్ని వెంకట మహాలక్ష్మి, కుమారుడు, కోడలు సత్యనారాయణ–పద్మావతి, అలాగే కీ॥శే॥ శ్రీమాన్ ఖరీదు నాగేశ్వరరావు జ్ఞాపకార్థం ధర్మపత్ని వెంకాయమ్మ, కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కపిలవాయి జగన్మోహన్‌రావు, వెచ్చ శ్రీనివాసరావు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నప్రసాదం అందించారు.