ఏపీలో మరో డీఎస్సీ నోటిఫికేషన్.. 2,721 టీచర్ పోస్టుల భర్తీకి ప్రకటన
నిరుద్యోగ యువతకు మరో అవకాశం.. ఏటా డీఎస్సీ నిర్వహిస్తామన్న హామీ దిశగా ప్రభుత్వం అడుగులు
అమరావతి (ఎన్ టుడే న్యూస్): ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం మరో అవకాశం కల్పించినట్లు ప్రకటించింది. మొత్తం 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ–2026 నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సమాచారం.
ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన హామీ నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ ప్రకటించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో 2025 మెగా డీఎస్సీ ద్వారా 15,941 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసినట్లు వెల్లడించాయి.
తాజా డీఎస్సీ–2026 ద్వారా మరో 2,721 పోస్టులను భర్తీ చేయనుండటంతో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థుల్లో ఆసక్తి నెలకొంది. పోస్టుల వారీగా ఖాళీలు, అర్హతలు, దరఖాస్తుల ప్రారంభ తేదీ, చివరి తేదీ, పరీక్షల షెడ్యూల్ వంటి పూర్తి వివరాలను అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్లో పరిశీలించాలి.