BREAKING
thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే
Test 4
Date of Publish : 07 November 2026, 05:37 pm
Posted by : PEDDABOINA SRIKANTH

ఎల్కతుర్తిలో నూతన కోర్టుకు ఆమోదం.. 56 పోస్టులకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
07 Nov, 2026 - 05:37 PM
15 వీక్షణలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు

హనుమకొండ జిల్లా, ఎల్కతుర్తి (ఎన్ టుడే న్యూస్): ఎల్కతుర్తి మండల కేంద్రంలో నూతన కోర్టు ఏర్పాటుకు అనుమతి లభించడంతో పాటు, కోర్టు నిర్వహణకు అవసరమైన 56 పోస్టులకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై మండలంలో హర్షం వ్యక్తమైంది. ఈ సందర్భంగా ముప్పు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎల్కతుర్తి మండల కేంద్రంలో కృతజ్ఞతా కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముప్పు శ్రీనివాస్ మాట్లాడుతూ, మండల కేంద్రంలో కోర్టు ఏర్పాటు కావడం వల్ల ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువ అవుతాయని తెలిపారు. ఇప్పటివరకు న్యాయపరమైన అవసరాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చిన ప్రజలకు ఈ కోర్టు ఏర్పాటు సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. కోర్టు నిర్వహణకు 56 పోస్టులకు కేబినెట్ ఆమోదం లభించడం వల్ల అవసరమైన సిబ్బంది నియామకానికి మార్గం సుగమమవుతుందని అన్నారు.

ఎల్కతుర్తి మండల ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చే దిశగా కోర్టు మంజూరుకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రత్యేక చొరవ చూపిన రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు మండల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

నూతన కోర్టు ఏర్పాటు నిర్ణయం ఎల్కతుర్తి మండల అభివృద్ధిలో కీలక ముందడుగు అని, దీనివల్ల స్థానిక ప్రజలకు న్యాయ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.