BREAKING
thumb ● బోయకొండ దేవస్థానం ఈవో కార్యాలయంలో సీసీ కెమెరాలపై ప్రశ్నలు thumb ● ఎస్ఎంసీ నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే thumb ● వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎంపీపీ వెంకట కృష్ణారావు thumb ● ఆత్రేయపురంలో ఎస్ఎంసీ ఎన్నికల్లో ఉద్రిక్తత thumb ● అర్హత లేని ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి thumb ● సింగరేణి గుడిసెల్లో సినిమా షూటింగ్ సందడి శరవేగంగా నూతన చిత్రం చిత్రీకరణ thumb ● SIRపై కాంగ్రెస్ వైఖరిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విమర్శించారు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● బోయకొండ దేవస్థానం ఈవో కార్యాలయంలో సీసీ కెమెరాలపై ప్రశ్నలు thumb ● ఎస్ఎంసీ నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే thumb ● వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎంపీపీ వెంకట కృష్ణారావు thumb ● ఆత్రేయపురంలో ఎస్ఎంసీ ఎన్నికల్లో ఉద్రిక్తత thumb ● అర్హత లేని ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి thumb ● సింగరేణి గుడిసెల్లో సినిమా షూటింగ్ సందడి శరవేగంగా నూతన చిత్రం చిత్రీకరణ thumb ● SIRపై కాంగ్రెస్ వైఖరిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విమర్శించారు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి
Date of Publish : 30 September 2026, 12:09 pm
Posted by : MENDI SRINIVASARAO

దశాబ్దం పూర్తవుతున్న వేళ.. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం

ఆంధ్రప్రదేశ్
/ పార్వతీపురం మన్యం
Reporter
Mendi Srinivasarao జియ్యమ్మవలస మండల ప్రతినిధి
30 Sep, 2026 - 12:09 PM
14 వీక్షణలు

పార్వతీపురం: పార్వతీపురంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో 2014–2017 విద్యా సంవత్సరంలో చదువుకున్న పూర్వ విద్యార్థులు దాదాపు దశాబ్ద కాలం పూర్తవుతున్న సందర్భంగా ఆత్మీయ సమావేశానికి సిద్ధమవుతున్నారు.

కళాశాలలో చదువుకున్న సమయంలో తమ మధ్య చోటుచేసుకున్న అనేక సంఘటనలు, స్నేహబంధాలు, ఆవేశాలు, ఆవేదనలు, ఒకరికొకరు చేసిన సహాయాలు, ఆశయాలు, భావోద్వేగాలు, ఉపాధ్యాయులతో సాగిన సరదా సందర్భాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.

చదువుకున్న నాటి జ్ఞాపకాలను మరోసారి నెమరువేసుకుంటూ స్నేహబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పూర్వ విద్యార్థులు తమ కుటుంబ సభ్యులతో కలిసి సమావేశానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఈ స్నేహపూర్వక ఆత్మీయ సమావేశానికి 2014–2017 బ్యాచ్‌కు చెందిన 73 మంది పూర్వ విద్యార్థులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పాత స్నేహితులందరూ ఒకే వేదికపై కలుసుకుని గత జ్ఞాపకాలను పంచుకోవడం ద్వారా ఈ సమావేశాన్ని చిరస్మరణీయంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.