BREAKING
thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు
Test 4
Date of Publish : 15 November 2026, 02:49 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

యడవల్లి సర్పంచ్ అభ్యర్థిగా అట్లా లక్ష్మమ్మ ప్రకటన

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
15 Nov, 2026 - 02:49 PM
15 వీక్షణలు

పంచాయతీ ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ నాయకుల సమావేశం.. పార్టీ బలోపేతానికి సమష్టిగా పనిచేయాలని దద్దాల నారాయణ యాదవ్ పిలుపు

కనిగిరి: రానున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కనిగిరి మండలం యడవల్లి పంచాయతీకి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికల సన్నద్ధత, పార్టీ బలోపేతం, గ్రామస్థాయిలో పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేయడం వంటి అంశాలపై నాయకులు చర్చించారు.

ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. అనంతరం అందరి ఏకాభిప్రాయం మేరకు అట్లా వెంకటేశ్వర్లు సతీమణి అట్లా లక్ష్మమ్మను యడవల్లి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ ప్రకటించారు.

ఈ సందర్భంగా దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఆయా పథకాల ద్వారా ప్రజలకు అందిన ప్రయోజనాలను వివరించడంతో పాటు, ప్రస్తుత కూటమి ప్రభుత్వ విధానాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ప్రజలకు తెలియజేయాలని అన్నారు.

ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, వాటి పరిష్కారం కోసం పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీలోని ప్రతి నాయకుడు, కార్యకర్త వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి పార్టీ బలోపేతం, ఎన్నికల్లో విజయం లక్ష్యంగా సమష్టిగా పనిచేయాలని సూచించారు. గ్రామస్థాయిలో పార్టీ శ్రేణుల మధ్య ఐక్యత, సమన్వయం ఎంతో అవసరమని పేర్కొన్నారు.

ప్రజల అండదండలు, కార్యకర్తల ఐక్యతతో రానున్న పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తన బలాన్ని చాటాలని దద్దాల నారాయణ యాదవ్ ఆకాంక్షించారు. గ్రామంలోని నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అల్లాటిపల్లి, ప్రసాద్ రెడ్డి, కాసుల పెద గురవయ్య, బత్తుల మాల్యాద్రి, పల్లవుల మురళి, కాసుల బాలరాజు, కాసుల మల్లయ్య, పొంకం పెద్ద యోగయ్య, వంగేపురం జీవరత్నం, అంబటి మోషే, కొప్పర్తి రాజశేఖర్, బెజవాడ బాలయ్య, కోలా యేసయ్య, మంత్రి గురవయ్య, జల్దీ వెంకటేశ్వర్లు, సత్యాల చెన్నయ్య, వంగేపురం పెద్దన్న, కాసుల కోటేశ్వరరావు, కాసుల పుల్లయ్య, వంగేపురం రంగారావు, వంగేపురం రవి, కోలా యోబు, కోలా బాలగురవయ్య, వంగేపురం లాజరు, గంటా దేవసహాయం, గంటా ఇజ్రాయెలు తదితరులు పాల్గొన్నారు.