BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 14 October 2026, 11:50 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

ఏకగ్రీవం కోసం పదవుల వేలం.. జైలు శిక్ష, ఆరేళ్ల అనర్హత!

ఆంధ్రప్రదేశ్
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
14 Oct, 2026 - 11:50 PM
8 వీక్షణలు

ఏకగ్రీవం కోసం పదవుల వేలం.. జైలు శిక్ష, ఆరేళ్ల అనర్హత!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవం సాధించేందుకు వార్డు సభ్యుల పదవులను వేలం వేయడం చట్టవిరుద్ధమని రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) హెచ్చరించింది. ఇలాంటి అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

పదవుల వేలానికి పాల్పడిన వారికి ఏడాది జైలు శిక్షతో పాటు ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత విధించే అవకాశం ఉందని ఎన్నికల సంఘం హెచ్చరించినట్లు సమాచారం.

వేలం ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలని SEC నిర్ణయించింది. ఆరోపణలు వచ్చిన ప్రాంతాల్లో సంబంధిత జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా ఏకగ్రీవ ఎన్నికల ఫలితాలను ప్రకటించరాదని స్పష్టం చేసింది.

వేలం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లభిస్తే సంబంధిత వార్డుల్లో ఎన్నికల ప్రక్రియను నిలిపివేసే అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉంటుందని పేర్కొంది. ఎన్నికలు పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపింది.