BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 14 October 2026, 11:41 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

ఆల్ఫా రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్‌లో కార్మికులకు అవగాహన కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
14 Oct, 2026 - 11:41 PM
8 వీక్షణలు

రొయ్యల ప్రాసెసింగ్‌ యూనిట్‌లో కార్మికులకు అవగాహన కార్యక్రమం

మహిళా కార్మికులకు న్యాయం పొందడం రాజ్యాంగం కల్పించిన హక్కు: న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు

సింగరాయకొండ (ఎన్‌ టుడే న్యూస్‌): మహిళా కార్మికులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, పని ప్రదేశాల్లో సమస్యలు ఎదురైతే భయపడకుండా చట్టపరమైన మార్గాల ద్వారా న్యాయం పొందాలని న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు సూచించారు.

లేబర్‌, మెడికల్‌, ఫిషరీస్‌ శాఖలు, సార్డ్స్‌ సంస్థ సమన్వయంతో నిర్వహిస్తున్న శ్రింప్‌ సినర్జీ ప్రాజెక్ట్‌లో భాగంగా పాత సింగరాయకొండ పరిధిలోని ఆల్ఫా రొయ్యల ప్రాసెసింగ్‌ యూనిట్‌లో కార్మికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు, విలేజ్‌ ఫిషరీస్‌ అసిస్టెంట్‌ షేక్‌ అష్మా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా పంతగాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. మహిళా కార్మికుల ఆరోగ్యం, భద్రత, పని ప్రదేశాల్లో రక్షణకు సంబంధించిన చట్టపరమైన అంశాలను వివరించారు. కార్మికులు తమ హక్కులపై అవగాహన పెంచుకోవాలని, సమస్యలు ఎదురైనప్పుడు సంబంధిత అధికారులను సంప్రదించి న్యాయం పొందాలని సూచించారు. ప్రతి పరిశ్రమలో మహిళల గౌరవం, భద్రతకు ప్రాధాన్యమిస్తూ సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించాలని పేర్కొన్నారు.

పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించేందుకు చట్టప్రకారం అవసరమైన చోట అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలని జెండర్‌ ఎక్స్‌పర్ట్‌ సంధ్య వివరించారు. ఫిర్యాదుల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవడంతోపాటు మహిళా కార్మికులు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేసే వాతావరణాన్ని యాజమాన్యాలు కల్పించాలని సూచించారు.

కౌన్సెలర్‌ బాషా మాట్లాడుతూ.. కార్మికులకు అందుబాటులో ఉన్న సామాజిక భద్రతా పథకాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, వాటి ప్రయోజనాలు, అర్హతల గురించి వివరించారు. అర్హులైన కార్మికులు ప్రభుత్వ పథకాల ద్వారా లభించే ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కార్యక్రమానికి సార్డ్స్‌ సిబ్బంది కోటయ్య అధ్యక్షత వహించారు. ఆల్ఫా మెరైన్స్‌ యాజమాన్యం తరఫున వెంకటేశ్వర్లు, మస్తాన్‌, సార్డ్స్‌ సిబ్బంది, రొయ్యల ప్రాసెసింగ్‌ యూనిట్‌ కార్మికులు, సంబంధిత శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.