BREAKING
thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్ thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్
Test 4
Date of Publish : 15 November 2026, 04:05 am
Posted by : K MAHESH

విజ్‌డమ్ హైస్కూల్‌లో అగ్నిమాపక భద్రత, విపత్తు నిర్వహణపై అవగాహన కార్యక్రమం

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
15 Nov, 2026 - 04:05 AM
16 వీక్షణలు

విద్యార్థులకు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే పద్ధతులపై శిక్షణ.. మొబైల్ ఫోన్ల వినియోగాన్ని తగ్గించి పిల్లలతో తల్లిదండ్రులు సమయం గడపాలని సూచన

నర్సంపేట: విద్యార్థుల్లో అగ్నిమాపక భద్రత, విపత్తు నిర్వహణపై అవగాహన కల్పించేందుకు నర్సంపేటలోని విజ్‌డమ్ హైస్కూల్‌లో శనివారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ అధికారులు పాల్గొని విద్యార్థులకు వివిధ రకాల ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రాణరక్షణ పద్ధతుల గురించి వివరించారు.

అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తుగా పాటించాల్సిన భద్రతా నియమాలను అధికారులు విద్యార్థులకు తెలియజేశారు. అనుకోకుండా అగ్నిప్రమాదం సంభవించినప్పుడు భయాందోళనలకు గురికాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రమాద తీవ్రతను బట్టి తగిన విధంగా స్పందించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలి, ప్రమాదాలను నివారించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలను వివరించారు.

అదేవిధంగా వరదలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సురక్షిత ప్రాంతాలకు చేరుకునే విధానాలు, నీటి వనరుల వద్ద పాటించాల్సిన భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ఈత కొట్టే సమయంలో ఎదురయ్యే ప్రమాదాలు, నీటిలో చిక్కుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విపత్తుల సమయంలో ఇతరులను రక్షించేందుకు అనుసరించాల్సిన ప్రాథమిక పద్ధతులను వివరించారు.

ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు భద్రతపై అవగాహన పెంపొందించడంతో పాటు అనుకోని ప్రమాదాలు, విపత్తులు ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉండటం, తమ ప్రాణాలను కాపాడుకోవడం, ఇతరుల రక్షణకు సహకరించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

విజ్‌డమ్ ప్రీస్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

విజ్‌డమ్ ప్రీస్కూల్‌లో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ జహంగీర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు మంచి అలవాట్లు అలవర్చుకోవాలని, భవిష్యత్తులో దేశానికి ఆదర్శంగా నిలిచే పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.

పాఠశాల డైరెక్టర్ జావేద్ మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో పిల్లలు పుస్తకాల కంటే మొబైల్ ఫోన్లు, టెలివిజన్‌లకు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. అధిక సమయం డిజిటల్ పరికరాలతో గడపడం వల్ల పిల్లల ఆరోగ్యం, మానసిక ఎదుగుదలపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉందని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ, వారితో ఎక్కువ సమయం గడపాలని సూచించారు. పిల్లల అభిరుచులు, ఆలోచనలు తెలుసుకుంటూ వారిని చదువు, ఆటలు, సృజనాత్మక కార్యక్రమాల వైపు ప్రోత్సహించాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రీస్కూల్ ప్రిన్సిపాల్ ఫహీం సుల్తానా, కరస్పాండెంట్ జహంగీర్, డైరెక్టర్ జావేద్, అకడమిక్ అడ్వైజర్ నాజియా ఇక్బాల్, ప్రీస్కూల్ ఇన్‌ఛార్జి హారిక, ఉపాధ్యాయులు సరితా రాణి, దివ్య, మాధవి, రాధిక, అఖిల, స్వాతి, సౌజన్య, రవళి, సుజాత, రజనీకుమారి, కళ్యాణి, శ్రీలత, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.