కృష్ణానగర్ గ్రేవ్‌యార్డ్ అభివృద్ధి పనులు పరిశీలించిన బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి
ఎల్బీనగర్, అక్టోబర్ 28 | ఎన్ టుడే న్యూస్: గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని కృష్ణానగర్ గ్రేవ్‌యార్డ్ సుందరీకరణ, వాల్ పెయింటింగ్, ఫుట్‌పాత్‌ల అభివృద్ధి పనులను తాజా మాజీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సుమారు రూ.30 లక్షల జీహెచ్‌ఎంసీ నిధులతో ఈ పనులు చేపడుతున్నారు.
ఈ సందర్భంగా జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, నాణ్యతపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రేవ్‌యార్డ్ పరిసరాలను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని, వాల్ పెయింటింగ్ ద్వారా పరిసరాలకు సుందరమైన రూపాన్ని తీసుకురావాలని సూచించారు.
ఫుట్‌పాత్‌ల అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టి పాదచారులకు సౌకర్యవంతంగా ఉండేలా చూడాలని అధికారులకు తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులు దీర్ఘకాలం మన్నికగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.
పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని, పనులు వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. నిరంతరం పర్యవేక్షణ చేపట్టి ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు తెలిపారు.