BREAKING
తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం మెగా డీఎస్సీపై వీధి పోరాటాలు విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై రిలే నిరాహార దీక్ష శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం ఐక్యరాజ్యసమితి గుర్తించిన గిరిజనుల హక్కులను పాలకులు ఎందుకు పరిష్కరించడం లేదు? బండిఆత్మకూరు మండలం పార్నపల్లె లో PGRS నిర్వహించిన కలెక్టర్ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మహిళలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి: ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ఆడికృత్తిక మహోత్సవం ఆగస్టు 9 ప్రపంచ గిరిజన హక్కుల దినోత్సవాన్ని జయప్రదం చేయండి క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న జరిగిన జైలు భరో ను జయప్రదం చేద్దాం - citu జాతీయ చేనేత దినోత్సవం నేడు ఇకత్ ను దరిద్దాం చేనేతను ఆదరిద్దాం తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం మెగా డీఎస్సీపై వీధి పోరాటాలు విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై రిలే నిరాహార దీక్ష శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం ఐక్యరాజ్యసమితి గుర్తించిన గిరిజనుల హక్కులను పాలకులు ఎందుకు పరిష్కరించడం లేదు? బండిఆత్మకూరు మండలం పార్నపల్లె లో PGRS నిర్వహించిన కలెక్టర్ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మహిళలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి: ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ఆడికృత్తిక మహోత్సవం ఆగస్టు 9 ప్రపంచ గిరిజన హక్కుల దినోత్సవాన్ని జయప్రదం చేయండి క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న జరిగిన జైలు భరో ను జయప్రదం చేద్దాం - citu జాతీయ చేనేత దినోత్సవం నేడు ఇకత్ ను దరిద్దాం చేనేతను ఆదరిద్దాం
www.ntodaynews.com

బంజారాహిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం : మంటల్లో కాలిపోయిన భారీగా మద్యం బాటిళ్లు..

తెలంగాణ
/ హైదరాబాద్
08 Aug, 2026 - 08:24 PM
85 వీక్షణలు

బంజారాహిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం : మంటల్లో కాలిపోయిన భారీగా మద్యం బాటిళ్లు..

11 మందిని సురక్షితంగా కాపాడిన ఫైర్ సిబ్బంది

 హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 11లోని బీఆర్కే న్యూస్‌ భవనంలోని సెల్లార్‌లో ఉన్న దారువాలా వైన్‌ మార్ట్‌ స్టాక్‌ స్టోరేజీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. సెల్లార్‌ నుంచి పెద్ద ఎత్తున పొగలు, మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భవనంలో చిక్కుకున్న 11 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.మంటలను అదుపులోకి తీసుకురావడానికి నాలుగు ఫైర్‌ ఇంజిన్లను వినియోగించారు. స్టాక్‌ స్టోరేజీలో పెద్ద మొత్తంలో మద్యం నిల్వ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో భారీగా మద్యం బాటిళ్లు అగ్నికి ఆహుతైనట్లు సమాచారం.అగ్నిప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. ఘటనపై అగ్నిమాపక, సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టారు.