BREAKING
thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు
Test 4
Date of Publish : 15 November 2026, 04:17 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బూరుగుగూడెం బీసీ కాలనీలో చేతిపంపు మరమ్మతులు.. సొంత నిధులతో నీటి సమస్యకు పరిష్కారం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Nov, 2026 - 04:17 PM
166 వీక్షణలు

స్థానికుల ఇబ్బందులు గుర్తించి స్పందించిన కాలసాని సూర్యనారాయణ

బూరుగుగూడెం: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామంలోని బీసీ కాలనీ కొత్త బజారులో గత కొన్ని రోజులుగా నెలకొన్న తాగునీటి సమస్యకు స్థానిక నాయకుడు కాలసాని సూర్యనారాయణ అలియాస్ సూరిబాబు మాస్టారు చొరవతో పరిష్కారం లభించింది. కొత్త బజారులో ఉన్న చేతిపంపు గత కొంతకాలంగా మరమ్మతులకు గురై నీరు రాకపోవడంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నిత్యావసరాలకు నీరు అందక స్థానికులు అవస్థలు పడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన సూరిబాబు మాస్టారు స్పందించి, ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూడకుండా తన సొంత నిధులతో చేతిపంపునకు మరమ్మతులు చేయించారు. తిరిగి నీరు అందుబాటులోకి వచ్చేలా అవసరమైన ఏర్పాట్లు చేయడంతో స్థానికుల నీటి కష్టాలకు ఉపశమనం లభించింది. ప్రజలకు అవసరమైన సమయంలో ముందుకొచ్చి వ్యక్తిగతంగా ఖర్చు చేసి సమస్యను పరిష్కరించడంపై బీసీ కాలనీ కొత్త బజారు వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాలసాని సూర్యనారాయణకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన సేవాభావాన్ని అభినందించారు.