భద్రకాళి ఆలయంలో బతుకమ్మ వేడుకలు.. అమ్మవారికి ప్రత్యేక పూజలు
తెలంగాణ
/
హన్మకొండ
వరంగల్: బతుకమ్మ పండుగను పురస్కరించుకుని వరంగల్‌లోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారికి శరన్నవరాత్రి మహాయాగ పూర్వాంగ విధులను నిర్వహించి, భక్తులకు హరిద్రా దర్శనం కల్పించారు.
బతుకమ్మ పండుగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వరంగల్ నగరంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
భక్తుల రాకతో భద్రకాళి ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. భక్తిశ్రద్ధలతో సాగిన పూజా కార్యక్రమాలతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బతుకమ్మ పండుగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.