BREAKING
thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు
Date of Publish : 11 October 2026, 05:42 am
Posted by : కూనురు మధు

గీతాంజలి స్కూల్‌లో వైభవంగా బతుకమ్మ వేడుకలు

తెలంగాణ
/ నల్గొండ / కట్టంగూర్
11 Oct, 2026 - 05:42 AM
5 వీక్షణలు

గీతాంజలి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

కట్టంగూర్‌ (ఎన్‌ టుడే న్యూస్‌):

కట్టంగూర్‌ మండల కేంద్రంలోని గీతాంజలి ఇంగ్లీష్‌ మీడియం హైస్కూల్‌లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పాఠశాల విద్యార్థినులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా విద్యార్థినులు వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. అనంతరం పాఠశాల ఆవరణలో బతుకమ్మలను ఏర్పాటు చేసి, వాటి చుట్టూ సంప్రదాయ పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ ఉల్లాసంగా నృత్యాలు చేశారు. పాఠశాల ప్రాంగణం బతుకమ్మ పాటలతో సందడిగా మారింది.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్‌ ఉష మాట్లాడుతూ.. నేటి తరానికి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం పాఠశాలలో బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపడంతో పాటు సంప్రదాయాల పట్ల అవగాహన పెంచుతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.