ఈ నెల 18 వరకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
హనుమకొండ: తెలంగాణ జాగృతి ఫౌండర్, చైర్‌పర్సన్ కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు ఈ నెల 18వ తేదీ వరకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నట్లు ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు మాధవి తెలిపారు.
ఈ సందర్భంగా హనుమకొండ జిల్లాలోని పరకాల, వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి, భూపాలపల్లి జిల్లాలోని గోరికొత్తపల్లి, మహబూబాబాద్ జిల్లా కేంద్రం, జనగామ జిల్లాలోని పాలకుర్తిలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు, ప్రజల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మాధవి పేర్కొన్నారు. బతుకమ్మ వేడుకల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆమె కోరారు.