BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 10 October 2026, 09:51 pm
Posted by : BOYA SWAMY

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
Boya Swamy Chityala Mandal
10 Oct, 2026 - 09:51 PM
1 వీక్షణలు

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ: సర్పంచ్ సాగర్ల భానుశ్రీ భిక్షం

ఉరుమడ్లలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు

ఉరుమడ్ల: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను ఉరుమడ్ల గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు, యువతులు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి, సంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.

బతుకమ్మ పాటలు పాడుతూ సంప్రదాయ నృత్యాలు చేశారు. దేవాలయ ప్రాంగణం మహిళల సందడితో పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. గ్రామ మహిళలు, యువతులు భక్తిశ్రద్ధలతో బతుకమ్మలను పూజించి, తెలంగాణ సంస్కృతి వైభవాన్ని చాటిచెప్పారు.

ఈ వేడుకల్లో గ్రామ సర్పంచ్ సాగర్ల భానుశ్రీ భిక్షం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతిపై ప్రేమకు, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. తరతరాలుగా కొనసాగుతున్న మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో ఇటువంటి పండుగల నిర్వహణకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు.

ప్రజలు తమ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెంపొందించుకోవాలని, పండుగల ద్వారా ఐక్యత, స్నేహభావం, పరస్పర గౌరవం, ప్రకృతి పరిరక్షణ వంటి విలువలను అలవర్చుకోవాలని సూచించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ పండుగను అందరూ కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవడం సంతోషకరమని తెలిపారు.

గ్రామ మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ వేడుకలను విజయవంతం చేశారు.