BREAKING
thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే
Test 4
Date of Publish : 07 November 2026, 05:39 pm
Posted by : K MAHESH

2028లో తెలంగాణలో బీసీ ప్రభుత్వమే: తీన్మార్ మల్లన్న

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / చౌటుప్పల్
Reporter
K Mahesh Munugodu Constituency
07 Nov, 2026 - 05:39 PM
48 వీక్షణలు

మునుగోడు నుంచి తొలి బీసీ ఎమ్మెల్యే ఎన్నిక ఖాయం.. బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి

చౌటుప్పల్ (ఎన్ టుడే న్యూస్): బీసీలకు రాజకీయ అధికారంలో సముచిత ప్రాధాన్యత కల్పించడమే లక్ష్యంగా 2028 ఎన్నికల్లో తెలంగాణలో బీసీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు నియోజకవర్గం నుంచి తొలి బీసీ ఎమ్మెల్యే ఎన్నిక కావడం ఖాయమని ప్రకటించారు.

బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా 44వ రోజు పాదయాత్ర చౌటుప్పల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్నకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి, నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ప్రసంగించారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. రెడ్డి, వెలమల పాలనలో బీసీలకు తగిన రాజకీయ, ఆర్థిక ప్రాధాన్యత లభించడం లేదని విమర్శించారు. మునుగోడు నియోజకవర్గంలో 1.37 లక్షలకు పైగా బీసీ ఓట్లు ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఒక్క బీసీ కూడా ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

2028 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుంచి తొలి బీసీ ఎమ్మెల్యే గెలవడం ఖాయమని, రాష్ట్రంలో బీసీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీసీల రాజకీయ సాధికారత కోసం తమ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు.

బీసీల సంక్షేమం కోసం కేటాయించిన నిధులను ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఖర్చు చేయడం లేదని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. బీసీలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నిజాం కాలం నాటి భూ చట్టాల ఆధారంగా భూముల అంశాన్ని పరిశీలించి, భూమిలేని పేద బీసీలకు న్యాయం చేస్తామని ప్రకటించారు.

అలాగే వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థి పాలకూరి అశోక్‌ను గెలిపించాలని పట్టభద్రులను కోరారు. బీసీల హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం కోసం తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కొమిరిశెట్టి నరసింహులు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల హనుమాన్లు, బంధారపు నరసయ్య గౌడ్, పిట్టల శంకర్‌తో పాటు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.