BREAKING
thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్ thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్
Test 4
Date of Publish : 15 November 2026, 03:58 pm
Posted by : KADARI RAMANA

నిర్మల్‌లో ఘనంగా భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకలు

తెలంగాణ
/ నిర్మల్
Reporter
Kadari Ramana నిర్మల్ నియోజకవర్గం
15 Nov, 2026 - 03:58 PM
18 వీక్షణలు

గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం బిర్సా ముండా చేసిన పోరాటం చిరస్మరణీయం: ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

నిర్మల్, నవంబర్ 15 (ఎన్ టుడే న్యూస్):

జనజాతీయ గౌరవ దివస్, భగవాన్ బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని నిర్మల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ పాల్గొని భగవాన్ బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. భగవాన్ బిర్సా ముండా గిరిజన ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడని కొనియాడారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ధైర్యసాహసాలతో పోరాడి గిరిజన సమాజంలో సామాజిక, రాజకీయ చైతన్యాన్ని పెంపొందించిన మహనీయుడని పేర్కొన్నారు.

గిరిజనుల ఆత్మగౌరవం, హక్కులు, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం బిర్సా ముండా చేసిన పోరాటం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. ఆయన చేసిన త్యాగాలు, పోరాట స్ఫూర్తి భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు. గిరిజన సమాజ అభ్యున్నతి, హక్కుల సాధన కోసం ఆయన చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

బిర్సా ముండా ఆశయాలు, ఆదర్శాలను ముందుకు తీసుకెళ్తూ గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. జనజాతీయ గౌరవ దివస్ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకోవడం, ఆయన పోరాట స్ఫూర్తిని భావితరాలకు తెలియజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సత్యం చంద్రకాంత్, పార్టీ సీనియర్ నాయకులు ముత్యంరెడ్డి, రమణారెడ్డి, జనాల మెడిసమ్మరాజు, పట్టణ అధ్యక్షుడు సుంకర సాయి, జిల్లా కార్యదర్శి పుష్పూర్ నర్సారెడ్డి, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పండిత్ యాదవ్, మండల అధ్యక్షుడు మారు గంగారెడ్డి, కౌన్సిలర్లు గంజి రాజు, కోన స్టేషన్ ఈశ్వర్, మండలాల సర్పంచులు, నాయకులు వెంకటేష్, విజయ తదితరులు పాల్గొన్నారు.