BREAKING
thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే
Test 4
Date of Publish : 07 November 2026, 05:45 pm
Posted by : K MAHESH

జిల్లా అధ్యక్షుడిగా భూక్య రామోజీ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
07 Nov, 2026 - 05:45 PM
12 వీక్షణలు
  • ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా భూక్య రామోజీ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
  • జిల్లా ప్రధాన కార్యదర్శిగా దాసరి మహేందర్.. 60 మంది ఉపాధ్యాయులు సంఘంలో చేరిక

మహబూబాబాద్ (ఎన్ టుడే న్యూస్): ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఉపాధ్యాయ హక్కుల సాధన నేత భూక్య రామోజీ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా దాసరి మహేందర్ ఎన్నికయ్యారు. ఈ మేరకు నవంబర్ 7, 2026న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక గర్ల్స్ ప్రైమరీ స్కూల్‌లో సంఘం జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.

సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ధరావత్ బద్రునాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పార్నంది రామయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చాగంటి ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా పీఆర్టీయూ సీనియర్ నాయకులు బానోత్ బాలాజీ నాయక్, భూక్య రామోజీ నాయక్ ఆధ్వర్యంలో 60 మంది సభ్యులు పీఆర్టీయూ సంఘానికి రాజీనామా చేసి, పార్నంది రామయ్య, చాగంటి ప్రభాకర్ సమక్షంలో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘంలో చేరారు.

ఈ సందర్భంగా పార్నంది రామయ్య, చాగంటి ప్రభాకర్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుదీర్ఘకాలంగా ఉపాధ్యాయ హక్కుల సాధన కోసం భూక్య రామోజీ నాయక్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. దళిత, గిరిజన ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంతో పాటు ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న సీఆర్టీల సమస్యలపై కూడా ఆయన పోరాటం చేస్తున్నారని తెలిపారు. ఆయన సేవలను గుర్తించి మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వెల్లడించారు.

సంఘంలో గత 20 సంవత్సరాలుగా నిబద్ధతతో పనిచేస్తున్న దాసరి మహేందర్‌ను జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. అలాగే సంఘానికి సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న బానోత్ రంగన్న నాయక్, ఈదునూరి వెంకటేశ్వర్లును రాష్ట్ర కార్యదర్శులుగా నియమించారు. గతంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన మధ్యల వీరస్వామి, ధరావత్ బద్రు నాయక్‌లకు రాష్ట్ర సహాయ కార్యదర్శుల బాధ్యతలు అప్పగించారు.

ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షుడు భూక్య రామోజీ నాయక్, ప్రధాన కార్యదర్శి దాసరి మహేందర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ హక్కుల పరిరక్షణకు సంఘం తరఫున నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ముఖ్యంగా ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తామని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో సంఘం సీనియర్ నాయకులు బానోత్ బాలాజీ కుమార్, జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు కోడెము రజిత, ఇంద్రగంటి ఈద్దయ్య, మోకాళ్ల వెంకన్న, జిల్లా కార్యదర్శులు చింత బాలయ్య, మెడ వెంకట్, పవన్, జిల్లా నాయకులు హనుమంత్, భరత్, కిషన్, రవీందర్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.