BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 18 November 2026, 05:20 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విజయవాడలో ఘనంగా మాదల హరిచరణ్ (కిట్టు) జన్మదిన వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Nov, 2026 - 05:20 AM
10 వీక్షణలు

ఎన్టీఆర్ భవన్‌లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ కేశినేని చిన్ని, బుద్దా వెంకన్న ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ: తెలుగు యువత అధికార ప్రతినిధి మాదల హరిచరణ్ (కిట్టు) జన్మదిన వేడుకలు విజయవాడలో ఘనంగా నిర్వహించారు. అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తల సందడి మధ్య వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి. విజయవాడలోని ఎన్టీఆర్ భవన్‌లో, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యాలయం వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని), మాజీ ఎమ్మెల్సీ, పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి బుద్దా వెంకన్న ముఖ్య అతిథులుగా పాల్గొని మాదల హరిచరణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారీ కేక్ కట్ చేసి, శాలువాలు కప్పి, పూల బొకేలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యువతను ఏకతాటిపైకి తీసుకువస్తూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కిట్టు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ యువతలో నూతనోత్సాహం నింపుతున్నారని కొనియాడారు. యువత పార్టీకి ప్రధాన బలమని, యువ నాయకులు బాధ్యతతో ముందుకు సాగుతూ ప్రజాసేవలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. మాదల హరిచరణ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహిస్తూ రాజకీయంగా ఎదగాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కార్యాలయ సిబ్బంది, పట్టణ నియోజకవర్గ నాయకులు, కౌన్సిలర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.