చిట్యాలలో బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాలుగా ప్రభుత్వ అధినేతగా కొనసాగుతున్న సందర్భంగా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ‘సేవా సంకల్ప అభియాన్’ కార్యక్రమంలో భాగంగా బుధవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. బీజేవైఎం నాయకులు సిలువేరు నాగరాజు, కొండే కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేవైఎం నల్గొండ జిల్లా అధ్యక్షుడు కంబాలపల్లి సతీష్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు అండగా నిలవడం అభినందనీయమన్నరు. ఈ కార్యక్రమంలో బీజేపీ చిట్యాల పట్టణ, మండల అధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్, పీక వెంకన్న ముదిరాజ్, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకుడు మాస శ్రీనివాస్, బీజేపీ సీనియర్ నాయకుడు కన్నెబోయిన మహాలింగం యాదవ్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు కూరెళ్ల శ్రీను, జిల్లా కార్యవర్గ సభ్యుడు పల్లె వెంకన్న, జయరాపు రామకృష్ణ, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గంజి గోవర్ధన్, సీనియర్ నాయకుడు కంచర్ల శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు