BREAKING
thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం
Date of Publish : 09 October 2026, 06:11 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

టీడీపీకి గ్రామ అధ్యక్షుడు బోదనపు రమణారెడ్డి రాజీనామా

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
09 Oct, 2026 - 06:11 PM
5 వీక్షణలు

మార్కాపురం జిల్లా: దోర్నాల మండలం వై.చెర్లోపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు బోదనపు రమణారెడ్డి పార్టీకి, పార్టీ సభ్యత్వానికి, గ్రామ కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయనతో పాటు బట్టు వెంకటేశ్వర్ రెడ్డి, జంగాల రంగస్వామి, గుంటక మల్లికార్జున్ రెడ్డి, బోధనపు శ్రీనివాస్ రెడ్డి కూడా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా బోదనపు రమణారెడ్డి మాట్లాడుతూ గత 40 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ, కూటమి ప్రభుత్వం ఏర్పడేందుకు అహర్నిశలు కృషి చేశానని పేర్కొన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ మండల నాయకులు, ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి తనను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

తనను అవహేళన చేస్తూ పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన తాను పార్టీకి, పార్టీ సభ్యత్వానికి, వై.చెర్లోపల్లి గ్రామ కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు రమణారెడ్డి వెల్లడించారు.