భీమ్ ఆర్మీ మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడిగా బొల్గురి ముకేష్
NTODAY NEWS : నల్గొండ భీమ్ ఆర్మీ (భారత్ ఏక్తా మిషన్) మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడిగా బొల్గురి ముకేష్ నియమితులయ్యారు భీమ్ ఆర్మీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు వడ్డేపల్లి నాగరాజు సమక్షంలో ముకేష్ నూతన బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి నాగరాజు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే, ఛత్రపతి షాహూజీ మహారాజ్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, మాన్యశ్రీ కాన్షీరామ్ బహుజన సిద్ధాంతాలు, భావజాలాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే లక్ష్యంతో ముకేష్‌కు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధి, నిజాయితీతో నిర్వహించి సంస్థ బలోపేతానికి కృషి చేస్తారనే నమ్మకం ఉందన్నారు. నూతన అధ్యక్షుడు బొల్గురి ముకేష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జిల్లా నాయకత్వానికి, ముఖ్యంగా జిల్లా అధ్యక్షుడు వడ్డేపల్లి నాగరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలో బహుజనులు, వెనుకబడిన వర్గాల హక్కుల పరిరక్షణతో పాటు వారి సమస్యల పరిష్కారానికి భీమ్ ఆర్మీ తరఫున నిరంతరం అందుబాటులో ఉంటూ కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ నియోజకవర్గ అధ్యక్షుడు వంగూరి శ్రీకాంత్, నాయకులు కొత్తూరు నవీన్, ఎర్రసాని స్వామి, గాదె రాజు, శివ, సాయి, మణికుమార్, హరిబాబు తదితరులు పాల్గొని ముకేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు.