BREAKING
thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● పెదకూరపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● పెదకూరపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
Date of Publish : 01 October 2026, 06:34 pm
Posted by : భూబత్తుల చెన్నారావు

జెస్సికా మొదటి పుట్టినరోజు వేడుకల్లో సరిహద్దు ప్రాంతాల నాయకులు

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
భూబత్తుల చెన్నారావు సత్తుపల్లి నియోజకవర్గం
01 Oct, 2026 - 06:34 PM
40 వీక్షణలు

సత్తుపల్లి–చాట్రాయి ప్రాంతాల మధ్య బంధాలు కొనసాగాలని ఆకాంక్ష

ఖమ్మం, అక్టోబర్ 1: ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి గ్రామానికి చెందిన ప్రముఖులు రాజిని నాగేంద్ర మనుమరాలు, యుగంధర్–మాలతి దంపతుల మానస పుత్రిక జెస్సికా మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పర్వతపురం గ్రామానికి చెందిన టీడీపీ, వైఎస్సార్ పార్టీ, బీజేపీ నాయకులు హాజరై చిన్నారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ సత్తుపల్లి నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఉండటంతో ఇరు ప్రాంతాల ప్రజల మధ్య బలమైన బంధుత్వాలు, అనుబంధాలు ఉన్నాయని తెలిపారు. సరిహద్దుల కారణంగా ప్రాంతాలుగా విడిపోయినప్పటికీ ప్రజలంతా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి జీవిస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఐక్యతతో ముందుకు సాగుతూ తమ తమ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.

కార్యక్రమంలో చాట్రాయి మండల టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ భూబత్తుల చెన్నారావు, పర్వతపురం గ్రామ టీడీపీ అధ్యక్షురాలు బొర్రా నాగమల్లేశ్వరి, బూత్ ఇన్‌చార్జి బొర్రా రామకృష్ణ, మాజీ అధ్యక్షులు నాగేశ్వరరావు, మల్లేశ్వరావు, సత్యనారాయణ, నారాయణ, రంగారావు, రాము, వాసు, సాయి, బీజేపీ నాయకుడు మేకపోతుల వెంకటేశ్వరావు, పర్వతపురం మాజీ సర్పంచ్, వైఎస్సార్ పార్టీ నాయకుడు మిద్దె శివాజీ తదితరులు పాల్గొన్నారు.