BREAKING
thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక
Test 4
Date of Publish : 11 November 2026, 07:20 pm
Posted by : K MAHESH

బీఆర్‌ఆర్ ఫౌండేషన్ సేవలు మానవత్వానికి నిదర్శనం: పున్నం రాము

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
K Mahesh Munugodu Constituency
11 Nov, 2026 - 07:20 PM
14 వీక్షణలు

అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి దశదిన కార్యక్రమం కోసం బియ్యం అందజేత

ఇబ్రహీంపట్నం, నవంబర్ 11:

ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ బీఆర్‌ఆర్ ఫౌండేషన్ అందిస్తున్న సేవలు మానవత్వానికి, నిస్వార్థ సేవాభావానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని ఫౌండేషన్ సభ్యుడు, బీఆర్‌ఎస్ ఆరుట్ల గ్రామ అధ్యక్షుడు, వార్డు మెంబర్ల ఫోరం ఇబ్రహీంపట్నం ఇన్‌చార్జి పున్నం రాము అన్నారు.

మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన కందాల భాష తండ్రి కందాల బుచ్చయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్‌ఆర్ ఫౌండేషన్ సభ్యులు బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. దశదిన కార్యక్రమ నిర్వహణకు అవసరమైన బియ్యాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా పున్నం రాము మాట్లాడుతూ.. బీఆర్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రామ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆపదలో ఉన్న వారికి సాధ్యమైనంత వరకు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు తమ దృష్టికి తీసుకువస్తే ఫౌండేషన్ తరఫున అవసరమైన తోడ్పాటు అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పనతో పాటు, విద్యార్థుల చదువులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడంలో బీఆర్‌ఆర్ ఫౌండేషన్ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలవడం, ఆపద సమయంలో ఆదుకోవడం తమ ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమని వివరించారు.

సేవా కార్యక్రమాల ద్వారా పేద కుటుంబాలకు కొంతైనా ఉపశమనం కల్పించవచ్చని, ప్రతి ఒక్కరూ తమకు చేతనైన విధంగా సమాజ సేవలో భాగస్వాములు కావాలని పున్నం రాము పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఆర్ ఫౌండేషన్, బీఆర్‌ఎస్ పార్టీ సభ్యులు పాల జంగయ్య, బైకని మహేందర్ యాదవ్, సద్దాం, బర్మల వెంకటేష్, బాహుబలి శివ, కొండూరు లింగం, నీళ్ల శివ, సంతోష్ రెడ్డి, భాష, పవన్, రమేష్, బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.