BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 01:02 pm
Posted by : KANDHULA NARESH

పేద విద్యార్థుల చదువుకు బుచ్చిరెడ్డి భరోసా!

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి / మల్కాజ్‌గిరి
Reporter
Kandhula Naresh కుత్బుల్లాపూర్ మండల ప్రతినిధి
20 Nov, 2026 - 01:02 PM
17 వీక్షణలు

171 మంది పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజుల చెల్లింపు.. టాపర్‌కు ఉన్నత విద్య కోసం ఆర్థిక సాయం హామీ

గాజులరామారం, నవంబర్ 20 (ఎన్ టుడే న్యూస్): పేద విద్యార్థుల విద్యాభ్యాసానికి అండగా నిలుస్తూ గాజులరామారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బుచ్చిరెడ్డి తన సేవాభావాన్ని చాటుకున్నారు. గాజులరామారం, సూరారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న 171 మంది విద్యార్థుల పరీక్ష ఫీజులను స్వయంగా చెల్లించి వారికి అండగా నిలిచారు.

ఈ మేరకు పరీక్ష ఫీజులకు సంబంధించిన మొత్తాన్ని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అశోక్ రెడ్డి, ప్రతిభకు అందజేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఈ సహాయం అందించినట్లు తెలిపారు.

ఇదే కాకుండా పదో తరగతి విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులకు హాజరయ్యే వారికి ప్రతిరోజూ స్నాక్స్ అందిస్తానని బుచ్చిరెడ్డి హామీ ఇచ్చారు. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెట్టి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. పదో తరగతి పరీక్షల్లో మొదటి ర్యాంకు సాధించే విద్యార్థికి ఉన్నత విద్యను కొనసాగించేందుకు అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తానని ప్రకటించారు.

పేద విద్యార్థుల చదువుకు అండగా నిలుస్తూ పరీక్ష ఫీజులు చెల్లించడంతో పాటు, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించేలా ఉన్నత విద్యకు సాయం చేస్తానని ముందుకు రావడంపై పలువురు అభినందించారు.

ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హార్ట్స్ సొసైటీ అధ్యక్షుడు విజయ్ కుమార్, అంజి ముదిరాజ్, అంజి యాదవ్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.