BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 06 October 2026, 09:42 am
Posted by : GOUTHAM RUDRARAPU

పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి

తెలంగాణ
/ సంగారెడ్డి
Reporter
Goutham Rudrarapu పటాన్ చెరు నియోజకవర్గ ప్రతినిధి
06 Oct, 2026 - 09:42 AM
358 వీక్షణలు

పటాన్‌చెరు: ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో పటాన్‌చెరు నియోజకవర్గంలో ఎన్నికల సందడి మొదలైంది. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వివిధ కార్మిక సంఘాలు తమ కార్యాచరణ, వ్యూహాలపై దృష్టి సారిస్తున్నాయి.

ఈ క్రమంలో టీయూడబ్ల్యూయూ నాయకులు, పలువురు ఆర్టీసీ కార్మికులు సోమవారం నియోజకవర్గ ఇన్‌ఛార్జి కాటా శ్రీనివాస్‌గౌడ్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలు, యూనియన్ ఎన్నికలకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు యూనియన్ ప్రతినిధులు తెలిపారు.

ప్రస్తుతం కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అలాగే రానున్న యూనియన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణ, వ్యూహాలపై కూడా సుదీర్ఘంగా చర్చించినట్లు వెల్లడించారు.

ఎన్నికల నేపథ్యంలో కార్మిక సంఘాల కార్యకలాపాలు మరింత ఊపందుకునే అవకాశం ఉందని నాయకులు పేర్కొన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం, వారి హక్కుల పరిరక్షణకు సంబంధించిన అంశాలను ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు తెలిపారు.