కనకదుర్గమ్మను దర్శించుకున్న కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్‌పర్సన్
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
విజయవాడ, సెప్టెంబర్ 30: కేంద్ర కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్‌పర్సన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ మాజీ కార్యదర్శి ఎస్. రాధా చౌహాన్ బుధవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆలయానికి చేరుకున్న రాధా చౌహాన్‌కు దేవస్థానం ఈవో వి.కె. శీనా నాయక్, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆమె అమ్మవారి మూలవిరాట్‌ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచన మండపంలో ఆమెకు వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ఈవో శీనా నాయక్ అమ్మవారి వస్త్రం, జ్ఞాపిక, లడ్డూ ప్రసాదాలను అందజేశారు.