చాట్రాయి మండలంలో స్థానిక ఎన్నికల వేడి.. రిజర్వేషన్లపై గ్రామాల్లో ఆసక్తికర చర్చలు
స్థానిక ఎన్నికల సమర శంఖారావం మోగడంతో గ్రామాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పంచాయతీలు, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆయా స్థానాల నుంచి పోటీ చేయబోయే అభ్యర్థులపై గ్రామాల్లో విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి.
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో మొత్తం 18 గ్రామ పంచాయతీలు ఉండగా, రిజర్వేషన్ల ప్రకారం వివిధ కేటగిరీలకు స్థానాలు కేటాయించినట్లు సమాచారం.
చీపురుగూడెం గ్రామ పంచాయతీని ఎస్టీలకు కేటాయించగా, బీసీలకు సంబంధించి పర్వతాపురం, బూరుగుగూడెం, సోమవరం పంచాయతీలు కేటాయించినట్లు తెలుస్తోంది. ఓసీ కేటగిరీలో చాట్రాయి (జనరల్), చనుబండ (జనరల్), నరసింహారావుపాలెం (జనరల్), కోటపాడు (మహిళ), పోలవరం (జనరల్), పోతనపల్లి (జనరల్), మర్లపాలెం (జనరల్), తుమ్మగూడెం (జనరల్), చిత్తూరు (మహిళ) స్థానాలు ఉన్నట్లు సమాచారం.
ఎంపీటీసీ స్థానాల విషయానికి వస్తే జనార్దనవరం ఎస్సీ మహిళ, చనుబండ జనరల్, సోమవరం జనరల్ మహిళ, చిన్నంపేట ఎస్సీ మహిళ, బూరుగుగూడెం ఓసీ జనరల్, చాట్రాయి ఓసీ జనరల్, నరసింహారావుపాలెం ఓసీ జనరల్, కోటపాడు ఓసీ మహిళ, పోలవరం ఓసీ మహిళ, పోతనపల్లి ఓసీ జనరల్, తుమ్మగూడెం ఓసీ, చిత్తపూరు ఓసీ, చీపురుగూడెం ఓసీ, మర్లపాలెం ఓసీ, కృష్ణారావుపాలెం ఎస్సీ కేటగిరీలకు కేటాయించినట్లు విశ్వసనీయ సమాచారం.
ఇక జడ్పీటీసీ స్థానం బీసీ మహిళలకు కేటాయించే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రిజర్వేషన్లు ఖరారైన నేపథ్యంలో ఆయా గ్రామాల్లో అభ్యర్థుల ఎంపిక, రాజకీయ సమీకరణాలపై చర్చలు మరింత ఊపందుకున్నాయి.