BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 03 August 2026, 08:35 pm
Posted by : కూనురు మధు

చేనేత భవన స్థల పరిశీలన

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
03 Aug, 2026 - 08:35 PM
172 వీక్షణలు

చేనేత భవన స్థల పరిశీలన

నల్గొండ జిల్లా చిట్యాల చేనేత సహకార పరపతి సంఘం భవన నిర్మాణానికి సంబంధించి సోమవారం సంఘ పాలకవర్గం, పట్టణ కుల పెద్దలు స్థలాన్ని పరిశీలించారు. చిట్యాల పాల కేంద్రం ఎదురుగా ఉన్న చేనేత సహకార సంఘం స్థలం వద్దకు చేరుకున్న నాయకులు, గతంలో నాటిన కడీలను, అప్పటి కలెక్టర్ దయాచారి వేసిన శంకుస్థాపన రాయి ను పరిశీలించారు. ​ఈ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే  వేముల వీరేశం రూ. 10 లక్షల నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారని, నిర్మాణ అంచనాల తయారీకి స్థానిక ఏఈని కూడా ఆదేశించారని ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులు గుర్తుచేశారు. ​ప్రభుత్వ నిధులు, దాతల సహకారంతో భవన నిర్మాణం

​ప్రభుత్వం మంజూరు చేసే నిధులతో పాటు, దాతల ఉదార సహకారంతో భవన నిర్మాణాన్ని త్వరలోనే చేపట్టి పూర్తి చేసేందుకు కృషి చేస్తామని చేనేత సహకార సంఘం చైర్మన్ గంజి సుధాకర్, ప్రధాన కార్యదర్శి చెరుపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం ఉపాధ్యక్షులు మిర్యాల వెంకటేశం, కోశాధికారి కోట రాంబాబు, డైరెక్టర్లు మిర్యాల ప్రకాశ్, వడ్డేపల్లి రాములు మరియు పట్టణ కుల పెద్దలు జెల్లా మనోహర్, గంజి వెంకటేశం, జెల్లా సత్తయ్య, గంజి కనకయ్య, సంగిశెట్టి మనోహర్, గంజి గోవర్ధన్, తడక మురళి, గుజ్జరి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.