BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 21 August 2026, 06:56 pm
Posted by : కూనురు మధు

చిట్యాల దుర్గమ్మ గుడిలో ఘనంగా సామూహిక వరలక్ష్మి వ్రతం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
21 Aug, 2026 - 06:56 PM
488 వీక్షణలు

చిట్యాల దుర్గమ్మ గుడిలో ఘనంగా సామూహిక వరలక్ష్మి వ్రతం

నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ వ్రతంలో పాల్గొనేందుకు అంచనాకు మించి మహిళా భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. మహిళా భక్తుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు. ఆలయ ఛైర్మన్ మారగోని ఆంజనేయులు గౌడ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. చిట్యాల మున్సిపల్ ఛైర్‌పర్సన్ పందిరి గీత రమేష్, వైస్ ఛైర్‌పర్సన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి పెద్దకాపర్తి తిరుమలనాథ స్వామి దేవస్థానం ఛైర్మన్ ఓర్సు రాజ్‌కుమార్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం, కౌన్సిలర్లు దేశబోయిన లత రాజేష్, బొబ్బలి సందీప్ రామ్‌రెడ్డి, గాలి యాదమ్మ లింగయ్య, మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తెరటుపల్లి హనుమంతు, సిల్వేరు మౌనిక శేఖర్, సాగర్ల గోవర్ధన్ తదితరులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ముఖ్య అర్చకులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ నేతృత్వంలో అర్చకులు గోవింద్ మిశ్రా, దుర్గేష్ శుక్ల, సూరజ్ తివారి, శ్రీను శర్మ, కిరణ్ శర్మలు వరలక్ష్మీ వ్రతంతో పాటు ఇతర పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కనకదుర్గ ఆలయ డైరెక్టర్లు గంజి వెంకటేశం, బుద్ధ విమలకృష్ణమూర్తి, వరకాంతం నరసింహారెడ్డి, రుద్రారపు లింగస్వామి, జిట్టా సాయిలు, కుమ్మరి దేవి, ఏళ్ల మాధవి తదితరులు పాల్గొన్నారు.