BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 27 June 2026, 06:49 pm
Posted by : కూనురు మధు

చిట్యాలలో పల్స్ పోలియోకు సర్వం సిద్ధం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
27 Jun, 2026 - 06:49 PM
174 వీక్షణలు

మండల పరిధిలో ఆదివారం (జూన్ 28) నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఈసం వెంకటేశం పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం మండల కేంద్రంలో ఆరోగ్య, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలకు పల్స్ పోలియో నిర్వహణపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.​ఈ సందర్భంగా వైద్య మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ మండల పరిధిలో 0 నుండి 5 సంవత్సరాల లోపు గల 2,872 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం మొత్తం 17 పల్స్ పోలియో బూత్‌లను ఏర్పాటు చేశామని వివరించారు. ​0 నుండి 5 సంవత్సరాల లోపు మొత్తం  2,872 మంది చిన్నారులకు  17 పోలియో బూత్‌లకు  ప్రతి బూత్‌కు నలుగురు చొప్పున ఆరోగ్య, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు విధులు నిర్వహిస్తారని తెలిపారు. 

0 నుండి 5 సంవత్సరాల ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించి, మండలంలో వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని సిబ్బందికి అధికారులు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సి.హెచ్.ఓ నర్సింగరావు,  సూపర్వైజర్ వెంకటరమణమ్మ, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు మరియు అంగన్‌వాడీ కార్యకర్తలు  పాల్గొన్నారు.