BREAKING
thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు
Test 4
Date of Publish : 15 November 2026, 05:18 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చనుబండలో ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు వారం రోజుల పాటు పుస్తక ప్రదర్శన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Nov, 2026 - 05:18 PM
39 వీక్షణలు

ఏలూరు జిల్లా, చాట్రాయి మండలం చనుబండ గ్రామంలోని శాఖా గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారం రోజుల పాటు నిర్వహించనున్న ఈ ప్రదర్శనను ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల విద్యాశాఖాధికారి వి.ఎస్.వి. బ్రహ్మచారి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన సంపదకు నిలయాలని, విద్యార్థులలో పఠనాసక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. గ్రంథాలయంలో చిన్నారుల కోసం కథల పుస్తకాలు, ప్రముఖుల జీవిత చరిత్రలు, పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలతో పాటు గృహిణులకు ఆసక్తికరమైన నవలలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా ప్రతిరోజూ గ్రంథాలయాన్ని సందర్శించి తమకు నచ్చిన పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. పుస్తక పఠనం ద్వారా విజ్ఞానం, ఆలోచనా శక్తి, భాషా పరిజ్ఞానం పెంపొందుతాయని తెలిపారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పి. రత్తయ్య, పి. నరేంద్ర పాల్గొన్నారు. శాఖా గ్రంథాలయాధికారి కె. శ్రీకాంత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.