BREAKING
thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక
Test 4
Date of Publish : 11 November 2026, 07:47 pm
Posted by : K MAHESH

కష్టకాలంలో స్నేహితుడి కుటుంబానికి అండగా బాల్యమిత్రులు

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
11 Nov, 2026 - 07:47 PM
15 వీక్షణలు

మానవత్వాన్ని చాటుకున్న కాంగ్రెస్ మండల నేతలు ఆకుతోట సతీష్, గుగులోతు మధు నాయక్‌తో పాటు స్నేహితులు

నెల్లికుదురు, నవంబర్ 11: స్నేహమంటే సంతోష సమయాల్లో తోడుగా ఉండటమే కాదని, ఆపద సమయంలో అండగా నిలిచి బాధ్యతను పంచుకోవడమే నిజమైన స్నేహానికి నిదర్శనమని కాంగ్రెస్ మండల నేతలు, బాల్యమిత్రులు ఆకుతోట సతీష్, గుగులోతు మధు నాయక్, మల్యాల అశోక్ అన్నారు. తమ బాల్యమిత్రుడు చిలుక రవి అకాల మరణంతో విషాదంలో ఉన్న ఆయన కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి స్నేహబంధంలోని గొప్పతనాన్ని చాటుకున్నారు.

నెల్లికుదురు మండలంలోని కాచికల్ గ్రామానికి చెందిన చిలుక రవి ఇటీవల అకాల మరణం చెందడంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ పరిస్థితుల్లో రవి బాల్యమిత్రులు తమ స్నేహితుడి కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. స్నేహితులందరూ కలిసి ఆర్థిక సహాయాన్ని సమీకరించి, రవి కుమార్తె భవిష్యత్తుకు భరోసా కల్పించే ఉద్దేశంతో ఆమె పేరు మీద ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ మిత్రుడు రవి తమ మధ్య లేకపోయినా, ఆయన కుమార్తె తమ అందరి బిడ్డేనని భావిస్తున్నట్లు తెలిపారు. ఆమెకు ప్రేమాభిమానాలు పంచడంతో పాటు, కుటుంబానికి అవసరమైన సమయంలో అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. స్నేహితుడి కుటుంబాన్ని ఒంటరిగా వదిలిపెట్టకుండా, జీవితాంతం తమ వంతు సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.

అనంతరం కుటుంబ సభ్యులకు ఫిక్స్‌డ్ డిపాజిట్ బాండ్‌ను అందజేసి ధైర్యం చెప్పారు. రవి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమానికి ఆర్థికంగా, ఇతర విధాలుగా సహకరించిన ప్రతి ఒక్క స్నేహితుడికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

స్నేహితుడి మరణంతో బాధలో ఉన్న కుటుంబానికి బాల్యమిత్రులంతా ఒకటిగా నిలిచి ఆర్థిక భరోసా కల్పించడం స్థానికంగా అభినందనీయంగా నిలిచింది. స్నేహం అనేది మాటలకే పరిమితం కాకుండా, అవసరమైన సమయంలో చేతల్లో చూపించాలనే సందేశాన్ని ఈ సహాయ కార్యక్రమం చాటిచెప్పింది.