BREAKING
thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్ thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్
Test 4
Date of Publish : 15 November 2026, 04:13 am
Posted by : K MAHESH

ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
K Mahesh Munugodu Constituency
15 Nov, 2026 - 04:13 AM
21 వీక్షణలు

విద్య, విజ్ఞానంతో పాటు ఆటపాటల్లోనూ రాణించాలి.. భవిష్యత్తులో దేశానికి మంచి పౌరులుగా ఎదగాలి: ప్రజాసంఘాల నాయకుడు కంబాలపల్లి భాస్కర్

ఇబ్రహీంపట్నం: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచాల మండలం ఆరుట్ల గ్రామంలోని తెలంగాణ పబ్లిక్ పాఠశాలలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజాసంఘాల నాయకుడు కంబాలపల్లి భాస్కర్ హాజరై విద్యార్థులతో కలిసి బాలల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు చాక్లెట్లు పంపిణీ చేసి వారిని అభినందించారు.

అనంతరం కంబాలపల్లి భాస్కర్ మాట్లాడుతూ బాలబాలికలు రాబోయే రోజుల్లో విద్య, విజ్ఞానంతో పాటు ఆటపాటల్లోనూ చక్కగా రాణించాలని ఆకాంక్షించారు. విద్య మనిషిలో విజ్ఞానాన్ని పెంపొందించడమే కాకుండా ఉన్నత భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ మంచి లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలని సూచించారు.

విద్యార్థులంతా కులమత భేదాలు లేకుండా అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లుగా కలిసిమెలిసి ఉండాలని, పరస్పర ప్రేమాభిమానాలు, స్నేహభావంతో ముందుకు సాగాలని అన్నారు. భవిష్యత్తులో గ్రామానికే కాకుండా దేశానికి మంచి పేరు తీసుకువచ్చే విద్యావేత్తలుగా, గౌరవప్రదమైన స్థానాల్లో నిలిచే వ్యక్తులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.

చాచా నెహ్రూ ఆశయాలకు అనుగుణంగా బాలలంతా ఐక్యత, సోదరభావంతో పెరుగుతూ సమసమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలంటే చిన్ననాటి నుంచే విద్యతో పాటు మంచి నడవడిక, సామాజిక బాధ్యతలను అలవర్చుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు పాల్గొని బాలల దినోత్సవ వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు.