BREAKING
thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి
Test 4
Date of Publish : 14 November 2026, 07:55 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గంపలగూడెం జీవీ అకాడమీలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Nov, 2026 - 07:55 PM
23 వీక్షణలు

 విద్యార్థుల ఆటల పోటీలు.. సాంస్కృతిక కార్యక్రమాలు.. విజేతలకు బహుమతుల ప్రదానం

గంపలగూడెం: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెంలోని జీవీ అకాడమీ సరస్వతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో విద్యార్థులకు వివిధ ఆటల పోటీలు, వినోద కార్యక్రమాలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి ప్రోత్సహించారు.

భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఉపాధ్యాయులు బాలల దినోత్సవ ప్రాముఖ్యతను, పిల్లలంటే చాచా నెహ్రూకు ఉన్న అభిమానాన్ని విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసంగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ సందర్భంగా జీవీ అకాడమీ చైర్మన్ గోపిచంద్ వేంపాటి మాట్లాడుతూ విద్యార్థులు కేవలం నేటి పౌరులు మాత్రమే కాదని, రేపటి భవిష్యత్ నాయకులని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థిలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహించడమే తమ లక్ష్యమని తెలిపారు.

అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ స్వరూప్ రాజ్, బ్రాంచ్ హెడ్ మమత, అంజిరెడ్డి, రాజ్‌కుమార్, అబ్దుల్, అంజలి, మాధవి తదితరులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నాయకత్వ లక్షణాల్లోనూ విద్యార్థులను ప్రోత్సహించడమే తమ విద్యాసంస్థ లక్ష్యమని ఈ వేడుకలు చాటిచెప్పాయి.