BREAKING
thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్ thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్
Test 4
Date of Publish : 15 November 2026, 06:55 pm
Posted by : K MAHESH

బాలల ప్రత్యేక ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / భువనగిరి
Reporter
K Mahesh Munugodu Constituency
15 Nov, 2026 - 06:55 PM
17 వీక్షణలు

బాలల సమస్యలపై కలెక్టర్‌కు వినతులు అందించాలి – జవహర్ బాల్ మంచ్ జిల్లా చైర్మన్ కొడారి వెంకటేష్

యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ / నవంబర్ 15 / ఎన్ టుడే న్యూస్:

బాలల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేసేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించనున్న ప్రత్యేక బాలల ప్రజావాణిని విద్యార్థులు, తల్లిదండ్రులు, సామాజిక కార్యకర్తలు సద్వినియోగం చేసుకోవాలని జవహర్ బాల్ మంచ్ యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ కొడారి వెంకటేష్ కోరారు.

భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 16న సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేక బాలల ప్రజావాణి నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బాలలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను నేరుగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి వినతిపత్రాలు అందించాలని సూచించారు.

బాలల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 14న గ్రామాల్లో బాలల గ్రామసభలను నిర్వహించిందని తెలిపారు. ఈ గ్రామసభల ద్వారా పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేసిన గ్రామపంచాయతీ సర్పంచులు, వార్డు సభ్యులు, సంబంధిత అధికారులకు బాలల తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రత్యేక బాలల ప్రజావాణిలో బాలల సమస్యలపై తల్లిదండ్రులు, విద్యార్థులు, సంబంధిత వర్గాలు వినతులు సమర్పించాలని కోరారు. ముఖ్యంగా బాల కార్మిక వ్యవస్థ, బాల్యవివాహాలు, విద్యార్థుల మధ్యలోనే చదువు మానివేయడం (డ్రాప్‌అవుట్స్‌), చిన్నారులపై శారీరక, మానసిక వేధింపులు వంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

అనాథలు, పాక్షిక అనాథ పిల్లలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను గుర్తించి, వారికి అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పిల్లల హక్కులకు భంగం కలిగించే సమస్యలను గుర్తించి సంబంధిత అధికారులకు తెలియజేయడం ద్వారా పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని పేర్కొన్నారు.

అలాగే జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులు, సౌకర్యాలపై కూడా ప్రత్యేక ప్రజావాణిలో ఫిర్యాదులు, వినతులు అందించాలని కొడారి వెంకటేష్ సూచించారు. పాఠశాలల్లో తాగునీటి సమస్యలు, ఉపాధ్యాయుల కొరత, నాణ్యమైన విద్య అందకపోవడం, విద్యార్థులకు పౌష్టికాహారం వంటి అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.

బాలల సమస్యల పరిష్కారం ఒక్క ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. పిల్లలకు సురక్షితమైన వాతావరణం, నాణ్యమైన విద్య, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బాలల ప్రత్యేక ప్రజావాణి ద్వారా తమ సమస్యలను నేరుగా జిల్లా కలెక్టర్‌కు తెలియజేసే అవకాశాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కొడారి వెంకటేష్ విజ్ఞప్తి చేశారు.