BREAKING
thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు thumb ● ఘనంగా రాచకొండ దసరా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● పల్లె పండుగ–3.O తో పల్లెల్లో రహదారుల అభివృద్ధి thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు thumb ● ఘనంగా రాచకొండ దసరా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● పల్లె పండుగ–3.O తో పల్లెల్లో రహదారుల అభివృద్ధి
Date of Publish : 06 October 2026, 08:59 pm
Posted by : THUNIKI NAGARAJU

రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
Thuniki Nagaraju రాయికల్ మండల ప్రతినిధి
06 Oct, 2026 - 08:59 PM
45 వీక్షణలు

“చదువుకుంటారా.. చదివిస్తా” అంటూ ఆప్యాయంగా పలకరింపు

జగిత్యాల: చేతుల్లో పుస్తకాలు పట్టుకుని బడికి వెళ్లాల్సిన చిన్నారులు రోడ్డుపై భిక్షాటన చేస్తుండటం గమనించిన జగిత్యాల పట్టణ సీఐ కరుణాకర్ వెంటనే స్పందించారు. తహసీల్ చౌరస్తా వద్ద విధులకు వెళ్తున్న సమయంలో తల్లిదండ్రులతో కలిసి భిక్షాటన చేస్తున్న నాలుగైదేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులను ఆయన గుర్తించారు.

వెంటనే వాహనాన్ని ఆపి చిన్నారుల వద్దకు వెళ్లిన సీఐ కరుణాకర్ వారిని ఆప్యాయంగా పలకరించారు. “చదువుకుంటారా.. మిమ్మల్ని చదివిస్తా” అంటూ చిన్నారులతో మాట్లాడి వారిలో భరోసా కల్పించారు.

పోలీసు అధికారి వెంట వస్తామని చిన్నారులు చెప్పడంతో వారిని ఆటోలో ఎక్కించి సురక్షితంగా తరలించారు. అనంతరం జిల్లా బాలల సంరక్షణ అధికారులకు సమాచారం అందించారు. చిన్నారుల భద్రత, విద్య, సంక్షేమానికి సంబంధించి తదుపరి చర్యలు చేపట్టే ప్రక్రియను ప్రారంభించారు.

విధుల్లో భాగంగా వెళ్తున్న సమయంలో చిన్నారుల పరిస్థితిని గమనించి వెంటనే స్పందించిన సీఐ కరుణాకర్ చొరవపై పలువురు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. బాలల భద్రత, విద్య, సంక్షేమంపై పోలీసు శాఖతో పాటు సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరాన్ని ఈ ఘటన చాటిచెప్పింది.