సిగరెట్ పొగతో పక్కన ఉన్నవారికీ ముప్పు.. వైద్యుల హెచ్చరిక
న్యూఢిల్లీ: సిగరెట్ తాగే వారితో పాటు వారి పక్కన ఉండి పొగను పీల్చే వారికీ ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనిని ‘సెకండ్‌హ్యాండ్ స్మోక్’గా పేర్కొంటారు.
సెకండ్‌హ్యాండ్ స్మోక్ ప్రభావంతో 2023లో భారత్‌లో సుమారు 3.2 లక్షల మంది మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. అదే సమయంలో సుమారు 44.4 కోట్ల మంది దీని ప్రభావానికి గురైనట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సెకండ్‌హ్యాండ్ స్మోక్ కారణంగా 17 లక్షల మంది మరణించినట్లు ఆందోళన వ్యక్తం చేశారు.
పొగ తాగని వారు కూడా సిగరెట్ పొగకు గురికావడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పబ్లిక్ ప్లేసుల్లో సిగరెట్ తాగడంపై మరింత కఠినమైన నిబంధనలు అమలు చేయాలని సూచిస్తున్నారు.