BREAKING
thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి thumb ● సంక్రాంతి ప్రయాణాలకు సిద్ధం.. 14 తేదీ నుంచి రైలు టికెట్ల బుకింగ్స్ ప్రారంభం! thumb ● హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్ నియామకం thumb ● కాంగ్రెస్ జిల్లా నేత బాలాజీ నాయక్‌ను పరామర్శించిన మాజీ జిల్లా అధ్యక్షుడు thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి thumb ● సంక్రాంతి ప్రయాణాలకు సిద్ధం.. 14 తేదీ నుంచి రైలు టికెట్ల బుకింగ్స్ ప్రారంభం! thumb ● హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్ నియామకం thumb ● కాంగ్రెస్ జిల్లా నేత బాలాజీ నాయక్‌ను పరామర్శించిన మాజీ జిల్లా అధ్యక్షుడు
Test 4
Date of Publish : 12 November 2026, 06:09 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విశాఖలో సీఐఐ అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు..

ఆంధ్రప్రదేశ్
/ విశాఖపట్నం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Nov, 2026 - 06:09 PM
3 వీక్షణలు

రూ.12.14 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం 2.46 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా విశాఖపట్నంలో సీఐఐ ఆధ్వర్యంలో అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సదస్సుకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా పాల్గొననున్నారు. ఈ అంతర్జాతీయ సదస్సుకు 18 దేశాలకు చెందిన మంత్రులు, 40 మంది అంతర్జాతీయ వక్తలు హాజరుకానున్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) ప్రాధాన్యతను వివరించేలా ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. సదస్సు నిర్వహణ కోసం ప్రధాని సమావేశ మందిరంతో పాటు నాలుగు ప్రత్యేక హాళ్లను సిద్ధం చేస్తున్నారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి భారీ పెట్టుబడులను తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. మొత్తం 141 సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకునేందుకు కసరత్తు చేస్తోంది. వీటి ద్వారా సుమారు రూ.12.14 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో 2.46 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. అంతర్జాతీయ పారిశ్రామిక సంస్థలను ఆకర్షించి రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి బాటలు వేయడమే ఈ సదస్సు ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.