BREAKING
thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి thumb ● సంక్రాంతి ప్రయాణాలకు సిద్ధం.. 14 తేదీ నుంచి రైలు టికెట్ల బుకింగ్స్ ప్రారంభం! thumb ● హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్ నియామకం thumb ● కాంగ్రెస్ జిల్లా నేత బాలాజీ నాయక్‌ను పరామర్శించిన మాజీ జిల్లా అధ్యక్షుడు thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి thumb ● సంక్రాంతి ప్రయాణాలకు సిద్ధం.. 14 తేదీ నుంచి రైలు టికెట్ల బుకింగ్స్ ప్రారంభం! thumb ● హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్ నియామకం thumb ● కాంగ్రెస్ జిల్లా నేత బాలాజీ నాయక్‌ను పరామర్శించిన మాజీ జిల్లా అధ్యక్షుడు
Test 4
Date of Publish : 12 November 2026, 07:37 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కంచికచర్లలో సీఐటీయూ పోస్టర్ ఆవిష్కరణ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Nov, 2026 - 07:37 PM
4 వీక్షణలు

డిసెంబర్ 1 నుంచి ఢిల్లీ ముట్టడి కార్యక్రమం..

 కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాటం కనీస వేతనం రూ.42 వేలు, పెన్షన్ రూ.21 వేలు అమలు చేయాలని డిమాండ్ ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్ల, నవంబర్ 12: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ డిసెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు నిర్వహించనున్న ఢిల్లీ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను గురువారం కంచికచర్లలోని ఎన్జీవో కార్యాలయంలో సీఐటీయూ నాయకులు, కార్మికులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐటీయూ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షురాలు ఎన్‌సీహెచ్ సుప్రజ మాట్లాడుతూ కార్మికులకు నష్టదాయకంగా ఉన్న నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పథకాలలో పనిచేస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్టు, పొరుగు సేవల కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. కనీస వేతనాన్ని రూ.42 వేలకు, కనీస పెన్షన్‌ను రూ.21 వేలకు పెంచాలని, అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం తీసుకొచ్చి సామాజిక భద్రత కల్పించాలని అన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, ప్రజల భూమి, నీరు, అటవీ వనరులపై హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలకు పన్ను రాయితీలు, ఇతర ప్రోత్సాహకాలు కల్పిస్తున్న కేంద్ర ప్రభుత్వం, అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం వంటి ప్రభుత్వ పథకాలలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు, సామాజిక భద్రత కల్పించేందుకు నిధులు లేవని చెప్పడం అన్యాయమని విమర్శించారు. నాలుగు కార్మిక చట్టాల అమలుతో కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రత దెబ్బతింటున్నాయని, ఎనిమిది గంటల పని విధానానికి విఘాతం కలుగుతోందని ఆరోపించారు. సమ్మె హక్కుపై ఆంక్షలు విధించడం కార్మికుల ప్రయోజనాలకు విరుద్ధమని పేర్కొన్నారు. రాష్ట్రంలో సుమారు నాలుగు లక్షల మంది అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, గ్రామ సంఘాల సహాయకులు, సమగ్ర శిక్ష, జాతీయ ఆరోగ్య మిషన్, ఉపాధి హామీ, 108, 104 తదితర ప్రభుత్వ పథకాలలో పనిచేస్తున్నారని తెలిపారు. మరో మూడు లక్షల మంది కాంట్రాక్టు, పొరుగు సేవలు, రోజువారీ వేతనాలు, పాక్షిక కాల ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నారని వివరించారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, ఇంటి అద్దెలు, వంటగ్యాస్, విద్యుత్ ఛార్జీల నేపథ్యంలో కార్మికులందరికీ నెలకు రూ.42 వేల కనీస ఆదాయం కల్పించాలని కోరారు. హమాలీ, ఆటో, భవన నిర్మాణ, స్వయం ఉపాధి, వలస కార్మికులకు కూడా ఈ మేరకు ఆదాయ భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు నెలవారీ ఆదాయంలో సగం పెన్షన్ రూపంలో అందించాలని, ఈపీఎస్, సీపీఎస్, ఎన్‌పీఎస్‌తో పాటు సామాజిక పెన్షన్లు పొందుతున్న వారికి తగిన భద్రత కల్పించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం డిసెంబర్ 1 నుంచి 3 వరకు ఢిల్లీలో నిర్వహించే ముట్టడి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వేలాది మంది కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందని సుప్రజ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కె.గోపాల్, కంచికచర్ల మండల నాయకులు గోపినాయక్, బెజ్జం భూషణం, పుల్లమ్మ, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.