BREAKING
thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ
Date of Publish : 10 October 2026, 05:33 pm
Posted by : PEDDABOINA SRIKANTH

దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
10 Oct, 2026 - 05:33 PM
6 వీక్షణలు

తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం

హన్మకొండ లోని తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యాలయంలో తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటించిన దసరా సెలవులను విద్యార్థులకు అమలు చేయకుండా, స్పెషల్ క్లాసుల పేరుతో తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాల తీరును తీవ్రంగా ఖండించారు.

ప్రభుత్వం ప్రకటించిన సెలవులను విద్యాసంస్థలు తప్పనిసరిగా అమలు చేయాలని, సెలవుల సమయంలో తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, యాజమాన్యాలపై సంబంధిత విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు సెలవులు నిరాకరించడం వల్ల వారిపై ఒత్తిడి పెరిగి, విశ్రాంతికి అవకాశం లేకుండా పోతోందని పేర్కొన్నారు.ప్రభుత్వం ప్రకటించిన సెలవులను తక్షణమే అమలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న విద్యాసంస్థలపై అధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం నాయకులు కోరారు. లేనిపక్షంలో విద్యార్థుల సహకారంతో ఆయా విద్యాసంస్థల్లో తరగతుల బహిష్కరణ కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో. T.R.S.V వరంగల్ జిల్లా నాయకులు పోగుల సుతేజ్ హనుమకొండ జిల్లా నాయకులు మహీధర్ వరంగల్ జిల్లా నాయకులు శివ, రతన్ రాజ్, వరుణ్, ఇమ్రాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.