స్థానిక ఎన్నికల్లో వంద శాతం సీట్లు గెలవాలి: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వంద శాతం సీట్లు గెలవడమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులకు స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో స్థానిక ఎన్నికలపై చర్చించిన ఆయన, నవంబర్ 15వ తేదీలోగా మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించినట్లు సమాచారం. కూటమి పార్టీల మధ్య సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ఎన్నికల్లో గెలుపు బాధ్యత పూర్తిగా ఇన్‌ఛార్జి మంత్రులదేనని స్పష్టం చేస్తూ, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుని పనిచేయాలని దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది.