BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 10 October 2026, 09:46 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

పేదల వైద్యానికి సీఎం సహాయనిధి అండ..

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
10 Oct, 2026 - 09:46 PM
12 వీక్షణలు
  • 122 మందికి రూ.58.36 లక్షల చెక్కుల పంపిణీ
  • మండలాల వారీగా ఆర్థిక సహాయం
  • ఇప్పటివరకు 1,982 మందికి రూ.15 కోట్ల సాయం
  • త్వరలో కొత్త పింఛన్లు, ఇళ్ల స్థలాల కార్యక్రమాలు

కందుకూరు: అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు ఆర్థిక సహాయం అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా కూటమి ప్రభుత్వం సహాయక చర్యలు కొనసాగిస్తోందని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. ఇందులో భాగంగా శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో సీఎం సహాయనిధి 45వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన 122 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.58.36 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

ఈ విడతలో వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు వారి వైద్య ఖర్చుల నిమిత్తం సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందించారు.

  • గుడ్లూరు మండలం: 41 మందికి రూ.20,30,572

  • కందుకూరు అర్బన్: ఆరుగురికి రూ.3,38,659

  • లింగసముద్రం మండలం: 32 మందికి రూ.14,86,088

  • ఉలవపాడు మండలం: 37 మందికి రూ.16,82,405

  • వలేటివారిపాలెం మండలం: ముగ్గురికి రూ.1,48,583

మరో లబ్ధిదారుడికి లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌ఓసీ) ద్వారా రూ.49,492 విలువైన వైద్య సహాయం అందించారు. ఇలా మొత్తం 122 మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించినట్లు ఎమ్మెల్యే కార్యాలయం వెల్లడించింది.

కందుకూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు 1,982 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సుమారు రూ.15 కోట్ల మేర ఆర్థిక సహాయం అందించినట్లు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్య చికిత్స పొందలేని పేద కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదలకు వైద్య సహాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రజలకు సంక్షేమ పథకాలను చేరువ చేయడంతో పాటు అర్హులైన వారికి అవసరమైన సహాయం అందించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని పేర్కొన్నారు.

ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ త్వరలో కొత్త పింఛన్లు, ఇళ్ల స్థలాలు అందించే కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు రాచగర్ల సుబ్బారావు, పూరిమిట్ల గురునాథం, జనిగర్ల నాగరాజు, ఏఎంసీ డైరెక్టర్లు కొత్తూరి వెంకట సుధాకర్, మాదాల వెంకటేశ్వర్లు, నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి చదలవాడ కొండయ్య, రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి బెజవాడ ప్రసాద్, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు కల్లూరి శైలజ, ప్రొఫెషనల్ వింగ్ అధ్యక్షురాలు పువ్వాడి మౌనిక, క్లస్టర్ నాయకులు, ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు.