BREAKING
thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే
Test 4
Date of Publish : 07 November 2026, 05:49 pm
Posted by : K MAHESH

కొడంగల్‌లో మెగా రైతుమేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పో ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ
/ మహబూబ్ నగర్
Reporter
K Mahesh Munugodu Constituency
07 Nov, 2026 - 05:49 PM
33 వీక్షణలు

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో కలిసి ప్రారంభించిన ముఖ్యమంత్రి.. రైతులు ఏర్పాటు చేసిన పంటల స్టాళ్ల పరిశీలన

కొడంగల్ (ఎన్ టుడే న్యూస్): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా దుద్యాల మండలం హకీంపేటలో ఏర్పాటు చేసిన మెగా రైతుమేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పోను శనివారం ప్రారంభించారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో కలిసి రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం రైతులు స్థానికంగా పండించిన వివిధ రకాల పంటలతో ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఆయా స్టాళ్లలో ప్రదర్శించిన పంటలను ఆసక్తిగా తిలకించి, రైతులతో మాట్లాడారు. వారు సాగు చేస్తున్న పంటలు, వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

వ్యవసాయ రంగంలో ఆధునిక సాగు పద్ధతులు, రైతులకు అందుబాటులో ఉన్న అవకాశాలు, వివిధ వ్యవసాయ ఉత్పత్తులను ఈ రైతుమేళాలో ప్రదర్శిస్తున్నారు. రైతులు, వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలతో పాటు పారిశ్రామిక రంగానికి చెందిన ప్రదర్శనలను ఇండస్ట్రియల్ ఎక్స్‌పోలో ఏర్పాటు చేశారు.

రైతుమేళా ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించనున్న సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు.